
వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయిన 579రోజుల్లో 767మంది ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. వరుస విపత్తులు వస్తే సమగ్ర నష్టం అంచనా ఎక్కడా చేయట్లేదని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వ్యవసాయ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో ఉన్నారని దుయ్యబట్టారు. దున్నపోతును ముళ్ల కర్రతో పొడిచినట్లు.. రైతులు కూడా ప్రభుత్వాన్ని పొడవటానికి సిద్ధంగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.