మహాత్మగాంధీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళి

మహాత్మగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులతోపాటు కాంగ్రెస్‌ నేత అజాద్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాళులర్పించారు. ఈ ంసదర్భంగా గాంధీజీ చేసిన సేవలు కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. గాంధీజీ ఆ రోజుల్లో పట్టుబట్టి బ్రిటిష్‌ కబంద హస్తాల నుంచి విముక్తి కలిగించిన వీరుడని, ఆయన చేసిన కృషి వల్లే నేడు మనందరం స్వేచ్ఛా […]

Written By: NARESH, Updated On : October 2, 2020 10:14 am
Follow us on

మహాత్మగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులతోపాటు కాంగ్రెస్‌ నేత అజాద్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాళులర్పించారు. ఈ ంసదర్భంగా గాంధీజీ చేసిన సేవలు కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. గాంధీజీ ఆ రోజుల్లో పట్టుబట్టి బ్రిటిష్‌ కబంద హస్తాల నుంచి విముక్తి కలిగించిన వీరుడని, ఆయన చేసిన కృషి వల్లే నేడు మనందరం స్వేచ్ఛా స్వాతంత్రాలతో కలిసి జీవిస్తున్నామని పేర్కొన్నారు. అహింసే ప్రధానంగా పోరాడిన గాంధీ సేవల చిరస్మరణీయమన్నారు.

Also Read: దళితులపై కాంగ్రెస్ కపట ప్రేమ