https://oktelugu.com/

‘అమరావతి’ ఆందోళన.. రాష్ట్రమంతా సాధ్యమేనా?

చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతిని రాజధానిని చేశాడు. అక్కడ జరిగిన అక్రమాలను పసిగట్టిన జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాన్సిల్‌ చేశారు. మూడు నగరాల కేంద్రంగా రాజధానులను ప్రకటించారు. దీంతో అమరావతి వేదికగా ఉద్యమం రాజుకుంది. అక్కడి రైతులు నిరాహార దీక్షకు దిగారు. ఏపీకి రాజధాని అంటూ ఉంటే అది అమరావతిలోనే ఉండాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని రోజులుగా కొంతమంది రైతులు, మహిళలు అమరావతి ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. Also Read: ఏపీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 10:20 am
    Follow us on

    చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతిని రాజధానిని చేశాడు. అక్కడ జరిగిన అక్రమాలను పసిగట్టిన జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాన్సిల్‌ చేశారు. మూడు నగరాల కేంద్రంగా రాజధానులను ప్రకటించారు. దీంతో అమరావతి వేదికగా ఉద్యమం రాజుకుంది. అక్కడి రైతులు నిరాహార దీక్షకు దిగారు. ఏపీకి రాజధాని అంటూ ఉంటే అది అమరావతిలోనే ఉండాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని రోజులుగా కొంతమంది రైతులు, మహిళలు అమరావతి ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

    Also Read: ఏపీలో హైకోర్టును మూసేయమనండి.. ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు?

    ఇప్పటివరకు అమరావతికే పరిమితమైన ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ప్రతీ నియోజకవర్గంలోనూ ప్రారంభిస్తామని మహిళా జేఏసీ నేతలు సవాల్ చేస్తున్నారు.. మరి ఉద్యమం ఎంత వరకు సాధ్యమవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు తోడ్పాటు ఎంత వరకు ఉందనేది వేచిచూడాల్సిందే.

    అమరావతి రాజధాని కోసం 29 గ్రామాల ప్రజలు భూములిచ్చారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక అమరావతికి బైబై చెప్పడంతో ఈ గ్రామాల రైతులే ప్రధానంగా ఆందోళనకు దిగారు. ఉంటే గిట్ల అమరావతిలోనే మూడు రాజధానులు ఉండాలనేది వీరి డిమాండ్‌. అమరావతి ఏరియాలో భూములు కొనుక్కున్న వారి కోరిక కూడా అదే. అందులోనూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులదీ ప్రత్యేకం. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. టీడీపీ నేతల బలమైన కోరిక కూడా అదే. ఇక్కడే రాజధానిని కొనసాగించాలని.కానీ.. జగన్ పంథా.. జనం కోరిక వేరు. మూడు చోట్ల రాజధానులను ప్రకటించడం వల్ల అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని ఆయన ప్రధాన ఆలోచన.

    జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీలోని మెజార్టీ పీపుల్‌ స్వాగతిస్తూనే ఉన్నారు. అందులోభాగంగా రాయలసీమలో హైకోర్టు పెట్టాలనే డిమాండ్‌ ఏళ్లగా ఉంది. ఇకపోతే.. రాజధాని అయ్యే అన్ని క్వాలిటీస్‌ విశాఖకు ఉన్నాయి. విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఉండాలనే డిమాండ్‌ కూడా ఉంది. ఈ క్రమంలో జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రాజధాని ఇక్కడే ఉండాలంటూ అమరావతిలో ఓ జేఏసీ ఏర్పాటు చేసి.. ఆ జేఏసీ ప్రధానంగా డిమాండ్‌ చేస్తుండడం గమనార్హం.

    Also Read: హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..?

    కొత్తగా.. ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని వద్దంటూ ఉత్తరాంధ్రలోని ప్రతీ నియోజకవర్గంలో ‘అమరావతి ఉద్యమాన్ని’ తీవ్రతరం చేస్తారట జేఏసీ మహిళా నేతలు. ఇదే క్రమంలో సీమలో హైకోర్టు వద్దని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు 29 గ్రామాల్లో జరుగుతున్న అమరావతి ఉద్యమాన్ని 175 నియోజకవర్గాల్లో ఉద్ధృతం చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇంతకు మించి రాజధాని రైతులను మోసం చేసే మాట మరొకటి ఉంటుందా అనేది ఇతర ప్రాంత ప్రజల ప్రశ్న. ఒక్క రాష్ట్రానికి చెందిన ప్రజలు అన్నదమ్ములుగా.. అక్కా చెల్లెళ్లుగా ఉండాల్సింది పోయి.. తమలో తమకే కొట్లాటలు పెట్టుకునేలా వ్యవహరించడం ఏంటని ఫైర్‌‌ అవుతున్నారు. మరి ఈ ఉద్యమం చివరికి ఎటు దారితీస్తుందో తెలియకుండా ఉంది.