రైతులతో చర్చలకు సిద్ధం: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

కేంద్ర వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఢిల్లీలోకి ప్రవేశించాలనుకున్న రైతులను రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత నిబంధనలతో అనుమతించారు. ఈ నేపథ్యంలో రైతులతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాలను ఆహ్వానించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. డిసెంబర్ మూడో తేదీన చర్చలు నిర్వహిస్తామన్నారు. అయితే రైతుల పేరుతో పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. రైతుల సమస్యలను రాజకీయం చేస్తున్నట్లు హర్యానా సీఎం మనోహర్ […]

Written By: Suresh, Updated On : November 28, 2020 4:02 pm
Follow us on

కేంద్ర వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఢిల్లీలోకి ప్రవేశించాలనుకున్న రైతులను రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత నిబంధనలతో అనుమతించారు. ఈ నేపథ్యంలో రైతులతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాలను ఆహ్వానించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. డిసెంబర్ మూడో తేదీన చర్చలు నిర్వహిస్తామన్నారు. అయితే రైతుల పేరుతో పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. రైతుల సమస్యలను రాజకీయం చేస్తున్నట్లు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు.