ప్రేమించుకొని పెళ్లికోసం పెద్దలను ఆశ్రయించారు. అయితే వారు ఒప్పుకోకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమజంట చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో విషాదం నింపింది. వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన రోహిత్, అవంతికలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు ప్రేమించుకున్న విషయాన్ని పెద్దలకు చెప్పారు. అయితే వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో జిల్లాలోని పెర్కిట్ శివారులోని ఓ చెట్టకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మ్రుతదేహాలను పోస్టుమార్టం […]
ప్రేమించుకొని పెళ్లికోసం పెద్దలను ఆశ్రయించారు. అయితే వారు ఒప్పుకోకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమజంట చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో విషాదం నింపింది. వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన రోహిత్, అవంతికలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు ప్రేమించుకున్న విషయాన్ని పెద్దలకు చెప్పారు. అయితే వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో జిల్లాలోని పెర్కిట్ శివారులోని ఓ చెట్టకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మ్రుతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.