నివర్ తుఫాను కారణంగా ఏపీలో 8 మంది మరణించినట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద బాధితన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడపలో ఇద్దరు మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల ఎత్తును పెంచనున్నట్లు ఆయన తెలిపారు. నివర్ తుఫాను కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగి పొర్లడంతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది.