జమ్మూ కాశ్మీర్ లో ‘ఆయుష్మాన్ భారత్ ’పథకాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రపాలిత లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్ లోని అన్నివర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. జమ్మూకాశ్మీర్ యుటి నివాసితులందరికీ ఈ బీమా కవరేజి వర్తిస్తుందని పేర్కొంది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక కవవరేజిఉంటుందన్నారు.