PM Modi China Tour: ఒకప్పుడు అమెరికా అంటే ప్రపంచం మొత్తం వణికిపోయేది. ఈ జాబితాలో మన దేశం కూడా ఉండేది. అమెరికా పరిపాలకులు మనదేశంలో పర్యటించడానికి వస్తే.. అదేదో స్వర్గం మన చెంతకు వచ్చినట్టు మన పరిపాలకులు భావించేవారు. మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే వ్యవస్థల వరకు అమెరికా అధిపతుల పర్యటనకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చేవి. ఆ తర్వాత భారత్ స్వతంత్రంగా ఎదగడం మొదలుపెట్టింది. తనకు తానుగా సరికొత్త శక్తిగా ఆవిర్భవించడం ప్రారంభించింది. తద్వారా అంతటి సర్వశక్తి సంపన్నమైన అమెరికాకు సవాల్ విసరడం మొదలుపెట్టింది. ప్రత్యక్షంగా ఎన్నడు కూడా అమెరికాతో కయానికి కాలు దువ్వకపోయినప్పటికీ.. పరోక్షంగా మాత్రం భారత్ గట్టిగానే సమాధానం చెబుతోంది. అమెరికా హెచ్చరించినప్పటికీ పుతిన్ పరిపాలిస్తున్న దేశం నుంచి ఆయిల్ కొనడం.. పాకిస్తాన్ తో అమీ తుమీకి సిద్ధపడటం వంటివి భారత్ సాధించిన ఇటీవల విజయాలు. ఎప్పుడైతే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం మొదలుపెట్టిందో.. అప్పటినుంచి అమెరికాకు మండుతోంది. అందువల్లే సుంకాలు విధించడం మొదలుపెట్టింది.
Also Read: వ్యాపారుడికి ఈ ఒక్క లక్షణం ఉంటే… డబ్బు సంచులు నిండినట్లే..
సరికొత్త సవాల్
సుంకాలు విధిస్తున్న అమెరికాకు గట్టిపడటం చెప్పడానికి భారత్ సిద్ధపడింది. దీనికోసం దీర్ఘకాలిక శత్రువు అయిన చైనా తో వ్యాపారాన్ని చేయడానికి మొదలుపెట్టింది. అందువల్లే భారత ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చైనా గడ్డమీద అడుగు పెట్టారు. SCO షాంగై మీట్ లో ఆదివారం, సోమవారం ఆయన పాల్గొంటారు. చైనా అధ్యక్షుడు మాత్రమే కాకుండా పుతిన్ కూడా ఇందులో పాల్గొంటున్నారు.. సుంకాలతో ఇబ్బంది పెడుతున్న అమెరికాకు ఈ సమావేశం ద్వారా రష్యా, చైనా, భారత్ గట్టి సమాధానం ఇవ్వబోతున్నాయని గ్లోబల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ మూడు దేశాలు కలిసిపోతే ప్రపంచ ముఖచిత్రం మొత్తం మారిపోతుందని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
కీలక ప్రకటన
తయారీ రంగాలను మరింత బలోపేతం చేయాలని ఈ మూడు దేశాల నాయకులు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా దేశంతో పోల్చితే ఈ మూడు దేశాలలో విలువైన మానవ వనరులు ఉన్నాయి. అంతేకాదు విస్తారమైన భూభాగం, ఇతర సదుపాయాలు ఉన్నాయి. తయారీ రంగాన్ని బలోపేతం చేసి.. దానికి తగ్గట్టుగా మార్కెట్ సృష్టించుకుని.. ఒక దేశం నుంచి మరొక దేశానికి ఉత్పత్తులను బదలాయింపు చేసుకుంటే అమెరికా పెత్తనానికి సవాల్ విసరవచ్చని ఈ మూడు దేశాల నాయకులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. మరోవైపు అమెరికా కాకుండా ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఈ మూడు దేశాలు భావించినట్టు సమాచారం.. ఎలక్ట్రానిక్స్, ఆహార వస్తువులు, ఇంధన రంగాలలో ఈ మూడు దేశాలు అత్యంత బలోపేతంగా ఉన్నాయి. ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్ సృష్టించుకుని.. ఆ దిశగా తమ ఎగుమతులను తరలిస్తే తిరుగు ఉండదని గ్లోబల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే ఈ భేటీ ద్వారా ట్రంప్ కు నిద్ర లేని రాత్రులు పరిచయమయ్యాయని.. ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చే రోజులు వచ్చేశాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రిక్స్ ను బలోపేతం చేసిన ఈ మూడు దేశాల నాయకులు.. తదుపరి అమెరికా పెత్తనాన్ని ప్రపంచం మీద లేకుండా చేస్తారని.. అది త్వరలోనే నెరవేరుతుందని గ్లోబల్ ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు.