Viral Photo: అప్పటిదాకా ఉన్న ప్రేమ మాయమైపోతుంది. కలిసి సాగించిన సంసారం సర్వనాశనం అవుతోంది. ఇద్దరు ఉండాల్సిన దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించడంతో.. కుటుంబం ఒక్కసారిగా తలకిందులవుతోంది. కోపాలు, తాపాల నుంచి మొదలుపెడితే పగలు ప్రతీకారాల దాకా వెళ్తోంది. తాళి కట్టిన భర్తను భార్య అంతం చేస్తోంది. తనలో సగమైన భార్యను భర్త చంపేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారణాలు.. మరెన్నో అకృత్యాలు.. అలాంటివారు ఈ కథనం కచ్చితంగా చదవాలి..
Also Read: వ్యాపారుడికి ఈ ఒక్క లక్షణం ఉంటే… డబ్బు సంచులు నిండినట్లే..
భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత. పిల్లలు మోయాలనిపించే బరువు. అందువల్లే మనదేశంలో సంసారాలు గొప్పగా వర్ధిల్లాయి. కుటుంబాలు వసుదైక అనే సామెతను నిజం చేశాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. భార్య మీద భర్తకు నమ్మకం లేదు. భర్త మీద భార్యకు ప్రేమ లేదు. స్మార్ట్ ఫోన్.. సోషల్ మీడియా.. చుట్టుపక్కల ఉన్న వాతావరణం.. ఇతర కారణాలు భారతదేశంలో కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడిగా ఉండే కుటుంబాలు ఇప్పుడు వేరు పడుతున్నాయి. ఉద్యోగం నిమిత్తం.. ఉపాధి నిమిత్తం నగరాలకు లేదా పట్టణాలకు వెళ్లిపోవడం పరిపాటిగా మారుతోంది. దీంతో చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడి.. అజమాయిషి అనేది లేకుండా పోతోంది. దీంతో విచ్చలవిడి అనేది పెరిగిపోతోంది. అందువల్లే ఇటువంటి అనర్ధాలు జరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కట్నాల కోసం.. ఇతర భరణాల కోసం భార్యాభర్తలు గొడవ పడుతున్న నేటి కాలంలో.. ఈ జంట ఆదర్శంగా నిలుస్తుంది. వారెవరో తెలియదు. ఆ సంఘటన ఎక్కడ జరిగిందో కూడా తెలియదు. కాకపోతే ఆ భార్యాభర్తలిద్దరూ కూలీ పనులకు వెళ్తున్నారు. భార్య చెప్పులు తెగిపోతే భర్త చేతిలో పట్టుకొని.. తన చెప్పులను ఆమెకు ఇచ్చాడు. ఆమె తెగిన చెప్పులను చేతిలో పట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ దృశ్యం ఆకట్టుకుంటున్నది. ఆలోచింపజేస్తున్నది. సంసారం అంటే పెత్తనం కాదని.. సర్దుకుపోవడమని.. బంధం అంటే బలాన్ని చూపించడం కాదని.. అర్థం చేసుకోవడం అని వీరిద్దరు నిరూపిస్తున్నారు.