https://oktelugu.com/

చివరిదశలో అందాలు ఒలకబోస్తోన్న శృతి హాసన్ !

శృతి హాసన్ అంటేనే మల్టీ టాలెంటెడ్. ఇక హీరోయిన్ గా కూడా శృతి ఈ మధ్య ఉన్నట్టుండి గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేస్తూ పోతుంది. వయసు పెరిగేకొద్దీ ఎక్స్ పోజింగ్ కూడా పెంచుకుంటూ పోతూ ఉంది. వారం క్రితం కొత్త ఫోటోషూట్ ఫోటోలలో అందచందాలు అన్నీ ఒకేసారి ఒలకబోసినట్లు హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్ల కళ్ళకు కనువిందు చేసింది ఈ సీనియర్ బ్యూటీ. మళ్ళీ ఇప్పుడు బికినీలో కొత్త అందాలను ఆరబోస్తూ మొత్తానికి తనలో ఇంకా […]

Written By:
  • admin
  • , Updated On : December 3, 2020 / 05:11 PM IST
    Follow us on


    శృతి హాసన్ అంటేనే మల్టీ టాలెంటెడ్. ఇక హీరోయిన్ గా కూడా శృతి ఈ మధ్య ఉన్నట్టుండి గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేస్తూ పోతుంది. వయసు పెరిగేకొద్దీ ఎక్స్ పోజింగ్ కూడా పెంచుకుంటూ పోతూ ఉంది. వారం క్రితం కొత్త ఫోటోషూట్ ఫోటోలలో అందచందాలు అన్నీ ఒకేసారి ఒలకబోసినట్లు హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్ల కళ్ళకు కనువిందు చేసింది ఈ సీనియర్ బ్యూటీ. మళ్ళీ ఇప్పుడు బికినీలో కొత్త అందాలను ఆరబోస్తూ మొత్తానికి తనలో ఇంకా ఆ గ్లామర్ ఉందని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్లు ఉంది. ఏది ఏమైనా తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచుతూ పోతుంది శృతి హాసన్.

    Also Read: పార్టీలో మెగా ఫ్యామిలీ…నిహారిక గ్రాండ్ పార్టీ

    మరి ఇంతగా హాట్ నెస్ తో రెచ్చిపోవడానికి కారణం సినిమా అవకాశాల కోసమా లేక.. గ్లామర్ ట్రీట్ కోసమా అనేది చూడాలి. రెండేళ్ల క్రితం శృతి హాసన్ ఫారీన్ బాయ్ ఫ్రెండ్ తో డీప్ లవ్ లో ఉండి కెరీర్ ను నిర్లక్ష్యం చేసి.. వచ్చిన ఛాన్స్ లను పోగొట్టుకొంది. ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ప్రియుడికి బ్రేకప్ చెప్పి మళ్ళీ సినిమాల మీద పడింది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ఆమెకు గతంలో వచ్చిన పెద్ద ఆఫర్లు ఏమి రాలేదు. చివరకు రవితేజ పక్కన యాక్ట్ చేస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం వరుసగా సినిమాలు ఒప్పుకుందామని ప్లాన్ చేస్తోన్నట్లు ఉంది.

    Also Read: పేరుకే విడాకులు, బంధం బలంగానే కొనసాగుతుందా?

    ప్రస్తుతం రవితేజ “క్రాక్”తో పాటు తమిళంలో “లాభం” సినిమాలు చేతిలో ఉన్నా.. ఆ సినిమాల వల్ల ఉపయోగం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అందుకే ఎలాగూ కొత్త సినిమాల షూటింగ్లు షురూ అవుతున్నాయి కాబట్టి, ఈ టైంలోనే కొత్త ఆఫర్లను పట్టుకుని.. మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఇలా గ్లామర్ డోస్ పెంచినట్లుంది శృతి. అన్నట్లు శృతికిప్పుడు 34 ఏళ్ళు. అంటే హీరోయిన్ గా ఆమెకు ప్రైమ్ ఏజ్ దాటింది అనుకోవాలి. సీనియర్ హీరోయిన్ల ఖాతాలో ఇప్పటికే చేరిపోయింది. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నట్లే.

    https://www.instagram.com/p/CISgwHaBpco/