భారత్ లో వ్యాక్సిన్ పంపిణీకి ’ఫైజర్‘ దరఖాస్తు

కరోనా వైరస్ నిరోధానికి ప్రపంచంలో అనే క వ్యాక్సిన్లు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అందరికంటే ముందుగా ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతినివ్వాలని ‘భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)ని కోరింది. ఈ మేరకు ఈనెల 4న ఫైజర్ దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని తాజాగా డీసీజీఐ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం […]

Written By: Suresh, Updated On : December 6, 2020 3:55 pm
Follow us on

కరోనా వైరస్ నిరోధానికి ప్రపంచంలో అనే క వ్యాక్సిన్లు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అందరికంటే ముందుగా ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతినివ్వాలని ‘భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)ని కోరింది. ఈ మేరకు ఈనెల 4న ఫైజర్ దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని తాజాగా డీసీజీఐ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా బహ్రెయిన్ కూడా ఫైజర్ వినియోగానికి అవకాశం ఇచ్చింది. ఇప్పడు భారత్ లో వినియోగానికి దరఖాస్తు చేసుకోవడంతో త్వరలో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.