https://oktelugu.com/

మోనాల్ కోసం అవినాష్‌ బలి.. బిగ్ బాస్ పక్షపాత ధోరణి !

బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ విషయంలో మొదటి నుండి బిగ్ బాస్ టీం పక్షపాత ధోరణి వ్యవహరిస్తూనే ఉందని ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. దేవీ నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్లు జరిగిన సమయంలో బిగ్ బాస్ టీం మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయినా బిగ్ బాస్ బృందం తమ విధానాన్ని మాత్రం మార్చుకునేలా కనిపించడం లేదు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్తారు అనేదాని […]

Written By:
  • admin
  • , Updated On : December 6, 2020 / 03:55 PM IST
    Follow us on


    బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ విషయంలో మొదటి నుండి బిగ్ బాస్ టీం పక్షపాత ధోరణి వ్యవహరిస్తూనే ఉందని ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. దేవీ నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్లు జరిగిన సమయంలో బిగ్ బాస్ టీం మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయినా బిగ్ బాస్ బృందం తమ విధానాన్ని మాత్రం మార్చుకునేలా కనిపించడం లేదు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్తారు అనేదాని పై చాలా రూమర్స్ వచ్చాయి.

    Also Read: పవన్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ ఎప్పుడంటే !

    వాటిల్లో ముఖ్యంగా మోనల్ ఎలిమినేట్ అవ్వకతప్పదు అని.. మోనల్ ఈ వారం సేవ్ అయ్యే చాన్సెసే లేవు అని వార్తలు వచ్చాయి. మోనాల్ ఎలిమినేట్ అయిందని, ఆమెను తీసుకెళ్లేందుకు ఆమె సోదరి హేమాలి కూడా బిగ్ హౌస్ దగ్గరకు వచ్చిందని రూమర్స్ వచ్చాయి. అయితే మోనాల్ ఎలిమినేట్ అయిందని అనుకునేలోపే బిగ్ బాస్ మళ్ళీ ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్ లిస్ట్ లోకి అవినాష్ పేరు తాజాగా ముందుకు వచ్చింది. అయితే ఓటింగ్ ఆర్డర్‌లో మోనాల్ చివరి స్థానంలో ఉన్నా కూడా ఎప్పటిలానే ఆమెను కాపాడేందుకు బిగ్ బాస్ టీం అవినాష్‌ను నిండా ముంచారని నెటిజన్లు అప్పుడే ఫైర్ అవుతున్నారు.

    Also Read: లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కి నో చెప్పిన అనసూయ !

    అసలు ఎలిమినేషన్‌లో బిగ్ బాస్ కి ట్విస్ట్ ఇవ్వడం అలవాటు అయిపోయినట్లు ఉంది. నిజానికి మొదట అభిజిత్ అఖిల్ హారిక అవినాస్ మోనాల్ నామినేషన్లోకి వచ్చారు. అభిజిత్ అఖిల్ ఎలాగూ సేవ్ అవుతారని అనుకున్నా.. అవినాష్ మోనాల్‌ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. అయితే మోనాల్ కంటే అవినాష్ బెటర్ పొజిషన్ లో ఉన్నాడు. మోనాల్ అవుట్ అనుకునే సమయంలో మళ్లీ అనూహ్యంగా తెరపైకి అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడని ప్రచారంలోకి రావడం బిగ్ బాస్ ఫాలోవర్స్ కి నిజంగా షాకే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్