
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్షననుభవిస్తున్న పెరరివళన్ కు సుప్రీం కోర్టు వారం రోజుల పెరోల్ ను మంజూరు చేసింది. ఆనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూడడానికి, మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు పెరోల్ పొందారు. ఈనెల 23 వరకు ఈ గడువు ఉందని కోర్టు తెలిపింది. కాగా గతంలోనూ 2017లో తన తండ్రి అనారోగ్యంతో ఉంటే పెరోల్ పొందిన విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివళన్ తో పాటు మురుగన్, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలాయాస్ సంతన్,రాబర్ట్ పయాస్ తదితరులు దోషులుగా ఉన్నారు.