
ఉత్తరప్రదేశ్ లోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఈ ఎన్నికల లెక్కింపు ఈనెల 3న జరుగనుంది. ఐదు పట్టభద్రులు, ఆరు ఉపాధ్యాయ స్థానాలకు మొత్తం 199 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాన్పూర్ నగర్, కాన్పూర్ దేహాట్, ఉన్నవో మినహా యూపీలోని 72 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది.