Center statement on IndiGo: భారత విమానయాన సంస్థ ఇండిగోలో ఆరు రోజులుగా నెలకొన్న సంక్షోభంతో వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్నవారు ఎయిర్ పోర్టులలో రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. అయినా ఇండిగో సంస్థ నుంచి క్షమాపణ తప్ప ప్రత్యామ్నాయ చర్యలు లేవు. ఆరు రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో కేంద్రం రంగంలోకి దిగింది. సీఈవోకు నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించింది. విచారణకు ఆదేశించింది. ఇండిగో ఎయిర్‌లైన్ సంక్షోభానికి ప్రధాన కారణం అంతర్గత ప్లానింగ్ లోపమే కారణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈమేరకు లోక్‌షభలో ప్రకటన చేశారు. సిబ్బంది రోస్టర్లు సరిగా ఏర్పడకపోవడం ఈ సమస్యకు దారితీసిందని తెలిపారు.
కఠినమైన సివిల్ ఏవియేషన్ నియమాలు..
లోక్‌సభలో రామ్మోహన్ మాట్లాడుతూ, ఇలాంటి సమస్యలను నివారించడానికి సివిల్ ఏవియేషన్ నియంత్రణల బాగా పాటించాల్సి ఉంటుందన్నారు. విమానయాన రంగంలో ఉన్న రికార్డులను పక్కన పెట్టకుండా, అన్ని కార్గోలు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
సాంకేతిక నవీకరణల అవసరం
విమాన సంస్థలు విమానాల సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకాలీకరించుకోవడం కూడా ముఖ్యమని మంత్రి చెప్పారు. డిజిటల్ వ్యవస్థలు, ప్రణాళికాహేతుబద్ధ విధానాలతో సిబ్బంది సమన్వయ సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని విమానయాన సంస్థలకు సూచించారు.
దేశంలోని విమానయాన రంగాన్ని ప్రపంచ ప్రమాణాలకు తగిన స్థాయిలోకి తీసుకెళ్లటం ప్రభుత్వం ఆశిస్తూ, సురక్షితమైన, సమర్థవంతమైన, వినియోగదారుల కోసం విశ్వసనీయ సేవలను అందించడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.