Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పిచ్చిపిచ్చి నిర్ణయాలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌తో, ముఖ్యంగా నరేంద్రమోదీతో మంచి స్నేహం చేశాడు. ఇరుదేశాల సంబంధాలు బలోపేతమయ్యాయి. 2.0 పాలనలో భారత్ టార్గెట్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే భారీగా సుంకాలు విధించారు. వాణిజ్య ఒప్పందం విషయంలో తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇక ఆపరేషన్ సిందూర్‌పై ప్రేలాపణలు పేలుతున్నారు. తాజాగా కూడా ఎనిమిది యుద్ధ విమానాలు కూలాయని ప్రకటించారు. ఇలా మానసిక స్థిరత్వం లేని ట్రంప్.. ఇప్పుడు భారత్‌తో మళ్లీ స్నేహానికి చేయి చాస్తున్నాడు.వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉన్న కూటమి వేడిని మళ్లీ పెంచాయి. ట్రంప్, ప్రధాని నరేంద్రమోదీ గురించి ‘గొప్ప స్నేహితుడు‘గా పేర్కొని ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు. భారత్ చమురు దిగుమతుల విషయంలో రష్యా ఆధారాన్ని తగ్గించడం ట్రంప్ వ్యాఖ్యల్లో మరో కీలక అంశం. ఆయన మాటల్లో కనబడిన ‘‘వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయి’’ అనే సంకేతం వెలువడింది.
అమెరికా–భారత్ స్నేహబంధానికి కొత్త దశ
2017–2020 మధ్య ట్రంప్–మోదీ సఖ్యత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయన మళ్లీ భారత పర్యటన ఐడియాను ప్రస్తావించడం, తన రెండవ పదవీకాలంలో కూడా భారత్‌ను కీ–పార్ట్‌నర్‌గా కొనసాగించే సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఫార్మా, టెక్, డిఫెన్స్ రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం వైట్ హౌస్ వ్యూహంలో సహజమైన అడుగుగా కనిపిస్తోంది.
ఫార్మా ఒప్పందం మధ్యలో డ్రామా
బరువు నియంత్రణ మందుల ధరలను తగ్గించేందుకు ట్రంప్ తీసుకువచ్చిన కొత్త ఫార్మా ఒప్పందం ఈ సమావేశంలో కేంద్రాంశంగా నిలిచింది. అయితే, ప్రసంగ మధ్యలో నోవో నార్డిస్క్ ప్రతినిధి గోర్డన్ ఫైండ్లు అకస్మాత్తుగా కుప్పకూలడం అక్కడి వాతావరణాన్ని అల్లకల్లోలం చేసింది. వైట్ హౌస్ వైద్య బృందం తక్షణం స్పందించగా, ఆ ఘటన తాత్కాలిక ఆరోగ్య సమస్య మాత్రమేనని స్పష్టతనిచ్చారు. ఈ సంఘటనతోపాటు ట్రంప్ చేసుకున్న ఫార్మా రిఫార్మ్ ఒప్పందం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ట్రంప్ వ్యాఖ్యల్లో భారత్‌ప్లై మిత్రస్ఫూర్తి మాత్రమే కాకుండా వ్యూహాత్మక లెక్కలు కనిపిస్తున్నాయి. చమురు దిగుమతులు, ఫార్మా పరిశ్రమలు, వాణిజ్య సమతౌలం ఈ మూడు లక్ష్యాల చుట్టూ పర్యటన సాగే అవకాశం ఉంది. రాబోయే సంవత్సరం ఈ పర్యటన జరిగితే, అది ఇండో–అమెరికన్ సంబంధాల కొత్త అధ్యాయానికి నాంది అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.