కొనసాగుతున్న రైతుల ఆందోళన

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఆదివారం కొనసాగనున్నాయి. శనివారం ప్రభుత్వంతో రైతుసంఘాల నేతలు జరిపిన చర్చలు అసంపూర్ణంగా పూర్తవడంతో ఆదివారం ఆందోళన కొనసాగించనున్నట్లు రైతులు తెలిపారు. అయితే 9న మరోసారి చర్చలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు 8న బంద్ నిర్వహించేందుకు రైతులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో పాటు విద్యుత్ బిల్లును కూడా రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. వీరికి ప్రముఖులు మద్దతు కూడా లభిస్తోంది. ఇక పంజాబ్లో సెలబ్రెటీలకు […]

Written By: Velishala Suresh, Updated On : December 6, 2020 9:35 am
Follow us on

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఆదివారం కొనసాగనున్నాయి. శనివారం ప్రభుత్వంతో రైతుసంఘాల నేతలు జరిపిన చర్చలు అసంపూర్ణంగా పూర్తవడంతో ఆదివారం ఆందోళన కొనసాగించనున్నట్లు రైతులు తెలిపారు. అయితే 9న మరోసారి చర్చలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు 8న బంద్ నిర్వహించేందుకు రైతులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో పాటు విద్యుత్ బిల్లును కూడా రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. వీరికి ప్రముఖులు మద్దతు కూడా లభిస్తోంది. ఇక పంజాబ్లో సెలబ్రెటీలకు కేటాయించిన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. మొన్నటి వరకు పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రైతులు మాత్రమే ఆందోళన చేయగా నిన్నటి నుంచి మధ్యప్రదేశ్ నుంచి కూడా రైతులు తరలివస్తున్నారు.