https://oktelugu.com/

ప్రభాస్ సినిమా పై సైఫ్ అలీ ఖాన్ క్రేజీ కామెంట్స్ !

రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటిస్తున్నాడు. మరి రావణాసురుడిగా ఇంకెవ్వరు నటిస్తే బాగుంటుందని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్రని సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో 10 తలల లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఎలా ఉంటాడా అని ఫ్యాన్స్ చర్చలు జరుపుతుంటే.. అదిరిపోయేలా ఉంటాను, రావణుడిగా అద్భుతంగా కనిపిస్తాను అని చెబుతున్నాడు సైఫ్ అలీ ఖాన్. మొత్తానికి ఆదిపురుష్ సినిమా గురించి తొలిసారి ఒక పెదవి విప్పాడు […]

Written By:
  • admin
  • , Updated On : December 6, 2020 / 09:57 AM IST
    Follow us on


    రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటిస్తున్నాడు. మరి రావణాసురుడిగా ఇంకెవ్వరు నటిస్తే బాగుంటుందని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్రని సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో 10 తలల లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఎలా ఉంటాడా అని ఫ్యాన్స్ చర్చలు జరుపుతుంటే.. అదిరిపోయేలా ఉంటాను, రావణుడిగా అద్భుతంగా కనిపిస్తాను అని చెబుతున్నాడు సైఫ్ అలీ ఖాన్. మొత్తానికి ఆదిపురుష్ సినిమా గురించి తొలిసారి ఒక పెదవి విప్పాడు సైఫ్. “రావణుడి పాత్రని కొత్త కోణంలో చూపించబోతున్నాడట డైరెక్టర్ ఓం రౌత్.

    Also Read: లేడీస్ ను నిద్రపోనివ్వని మహేష్ బాబు

    అసలు సీతని రావణుడు అపహరించడం వెనుకున్న కారణాన్ని సహేతుకంగా చూపించబోతున్నాడట. అలాగే లంకేశుడు అంటే రాక్షసుడు అనే కోణంలో కాకుండా మానవీయ అంశాలను జోడిస్తూ ఈ సినిమాని తీస్తున్నారని కూడా తెలుస్తోంది. రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు కాబట్టి.. ఎలాగూ రాముడు అంటేనే హీరో కాబట్టి.. ఆ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని సైఫ్ మాటల్లో తెలుస్తోంది.

    Also Read: బిగ్ బాస్: ఈ వారం మోనాల్ గజ్జర్ ఎలిమినేటెడ్

    తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ ఇంకా మాట్లాడుతూ.. ‘రావణుడి పాత్రని జస్ట్ ఒక విలన్ గా చూడొద్దు. ఆ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఆ పాత్రలో నటించడం నిజంగా గొప్పగా ఫీల్ అవుతున్నాను అంటూ సైఫ్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ రాముడుగా, కృతి సనాన్ సీతగా నటిస్తారు ఈ సినిమాలో. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవ్వనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్