కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నేడు రైతులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల బంద్ ను కొనసాగిస్తున్నారు. తెలంగాణలో బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తామని రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సలు బయటకు రాలేదు. తెల్లవారుజామున నుంచే టీఆర్ఎస్, కాంగ్రెస్ వామపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ బంద్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో సీపీఎం నాయకులు ఆందోళన చేస్తున్నారు. క్రుష్ణ జిల్లాలో ఉదయం 6 గంటల నుంచే రైతు సంఘాలు దుకాణ సముదాయాలను తెరవనివ్వడం లేదు. విశాఖపట్టనంలోని మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద వామపక్షాలు రాస్తారోకో నిర్వహించారు.