భారత్ బంద్ : ఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణ

భారత్ బంద్ లో పాల్గొన్న ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. భారత్ బంద్ లో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో తమ నిరసనను తెలుపుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ బంద్ లో ఎలా పాల్గొంటుందని ప్రశ్నించారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని తోపులాట జరిగింది. కరీంనగర్ బస్టాండ్ వద్ద జరిగిన ఈ సంఘటనతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. ఈ […]

Written By: Suresh, Updated On : December 8, 2020 9:25 am

trs congress

Follow us on

భారత్ బంద్ లో పాల్గొన్న ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. భారత్ బంద్ లో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో తమ నిరసనను తెలుపుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ బంద్ లో ఎలా పాల్గొంటుందని ప్రశ్నించారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని తోపులాట జరిగింది. కరీంనగర్ బస్టాండ్ వద్ద జరిగిన ఈ సంఘటనతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ఇవ్వని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసమని చెప్పుకుంటూ భారత్ బంద్ లో పాల్గొనడం హస్యాస్పదమన్నారు. సన్నరకం వడ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకొని కేసీఆర్ దేశ వ్యాప్తంగా జరిగే ఆందోళనకే మద్దతు ఎలా ఇస్తాడన్నారు.