భారత్ బంద్ ఉధృతం.. రోడ్డెక్కిన రైతులు, పార్టీల నేతలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు ఇచ్చిన బంద్ ఈరోజు దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ పాలనలోనే రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు బంద్ ను విజయవంతం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతోపాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటివరకు కేంద్రంతో 5 సార్లు చర్చలు జరిపినా ఫలితం రాకపోవడంతో ఈ […]

Written By: NARESH, Updated On : December 8, 2020 10:42 am
Follow us on

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు ఇచ్చిన బంద్ ఈరోజు దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ పాలనలోనే రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు బంద్ ను విజయవంతం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతోపాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటివరకు కేంద్రంతో 5 సార్లు చర్చలు జరిపినా ఫలితం రాకపోవడంతో ఈ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.

Also Read: భారత్ బంద్ ఎందుకు ?

ఇక దేశమంతా ఆకుపచ్చ జెండాలతోనే బంద్ లో పాల్గొనాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. కార్మిక, ఉద్యోగ, వ్యాపార సంఘాలు బంద్ కు మద్దతు పలికాయి. స్వచ్ఛందంగా దేశమంతా రైతులకు మద్దతుగా బంద్ లో పాల్గొంటున్నారు.

విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తాము ఉన్న చోట్లే రైతులకు మద్దతుగా నిరసన తెలుపుతున్నారు. బంద్ కు మద్దతుగా అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉద్యమం మొదలు కావడంతో మోడీ సర్కార్ కు ఇబ్బందిగా మారింది.

ఇక రోజంతా మార్కెట్లు, దుకాణాలు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కూరగాయలు, పాల సరఫరా దుకాణాలు కూడా బంద్ లో పాల్గొనాలని కోరారు. అత్యవసర సేవలు, అంబులెన్సులు, వివాహ కార్యక్రమాలకు మాత్రమే ఈ బంద్ లో అనుమతిస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్