
ఆన్‌లాక్ 5.0. మార్గదర్శకాల ప్రకారం సినిమా హాళ్లు , ప్రార్థనా మందిరాలకు అనుమతి ఇవ్వబోమని ఒడిశా ముఖ్యమ్తంరి నవీన్‌పట్నాయక్ పేర్కొన్నారు. అక్టోబర్ 31 వరకు అన్నీ మూతబడే ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం ఒడిశాలో కరోనావ్యాప్తి అధికంగా ఉందని, ఈ తరుణంలో సడలింపులు ఇస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎంట్రెన్స్ టెస్టులకు మాత్రం అనుమతినిస్తామని, నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థల్లో నిర్వహణా కార్యకలాపాలు జరుపుకోవచ్చని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఒడిశాలో 2,22,734 కరోనా కేసులు ఉండగా గడిచిన 24 గంటల్లో 3,615 మదికి కరోనా సోకింది.
Also Read: దేశంలో 63 లక్షల కరోనా కేసులు..