
గుంటూరు జిల్లాలో 15 మంది ట్యూషన్ విద్యార్థులకు కరోనా సోకడం కలకలం చేరింది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం భట్టూరులో కొందు చిన్నారులకు ఓ మాస్టారు తన ఇంటి వద్ద ట్యూషన్ చెప్పారు. ఇటీవల ఆ మాస్టారుకు కరోనా సోకింది. ఎందుకైన మంచిదని ట్యూషన్ వెళ్లిన విద్యార్థులకు తల్లిదండ్రులు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 15 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరంతా ఏడేళ్లలోపు చిన్నారులే కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులందరినీ ఎన్‌ఆర్‌ఐ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.
Also Read: దేశంలో 63 లక్షల కరోనా కేసులు..