నివర్ ఎఫెక్ట్: గ్రూప్-2 పరీక్షలు వాయిదా

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నివర్ ’ తుఫాను తమిళనాడు రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్నిచూపుతోంది. నిన్నటి నుంచి రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజా రవాణా పూర్తిగా దెబ్బతింది. చెన్నై నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లను నిలిపివేశారు. విమానాశ్రయం సేవలను రద్దు చేశారు. ఇక రేపు జరగాల్సిన గ్రూప్స్-2 పరీక్షలను వాయిదా వేశారు. అటు భారీ వర్షం కారణంగా పుదుచ్చేరిలో మూడు రోజులు సెలవును ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలు […]

Written By: Suresh, Updated On : November 26, 2020 12:23 pm

In this Wednesday, June 12, 2019, file photo, a waves crashes as people stand on boats on the Arabian Sea coast in Veraval, Gujarat, India. Indian authorities evacuated tens of thousands of people on Wednesday as a severe cyclone in the Arabian Sea approached the western state of Gujarat, lashing the coast with high winds and heavy rainfall. (AP Photo/Ajit Solanki, File)

Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నివర్ ’ తుఫాను తమిళనాడు రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్నిచూపుతోంది. నిన్నటి నుంచి రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజా రవాణా పూర్తిగా దెబ్బతింది. చెన్నై నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లను నిలిపివేశారు. విమానాశ్రయం సేవలను రద్దు చేశారు. ఇక రేపు జరగాల్సిన గ్రూప్స్-2 పరీక్షలను వాయిదా వేశారు. అటు భారీ వర్షం కారణంగా పుదుచ్చేరిలో మూడు రోజులు సెలవును ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఘాట్ రోడ్డుపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకునేలా అప్రమత్తమయ్యారు.