రైతుల నిరసన ఉద్రిక్తం

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్న రైతులు గురువారం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీలో నిరసన తెలిపేందుకు హర్యానా నుంచి బయలుదేరారు. ఈ సమయంలో వారిని పోలీసుులు అడ్డుకోవడంతో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ రైతులు ముందుకొచ్చారు. దీంతో రైతులను పోలీసులు చెదరగొట్టారు. రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. గత కొన్ని రోజులగా పంజాబ్, హర్యానా […]

Written By: Suresh, Updated On : November 26, 2020 12:12 pm
Follow us on

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్న రైతులు గురువారం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీలో నిరసన తెలిపేందుకు హర్యానా నుంచి బయలుదేరారు. ఈ సమయంలో వారిని పోలీసుులు అడ్డుకోవడంతో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ రైతులు ముందుకొచ్చారు. దీంతో రైతులను పోలీసులు చెదరగొట్టారు. రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. గత కొన్ని రోజులగా పంజాబ్, హర్యానా రైతులు ఈ బిల్లును రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.