నీరవ్‌కు మరోసారి చుక్కెదురు

భారత్‌ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను లండన్‌ కోర్టు ఐదోసారి తిరస్కరించింది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించే విచారణలో తదుపరి షెడ్యూల్‌ వరకు రిమాండ్‌ను పొడిగించింది. గత నెలలో నీరవ్‌ లాయర్‌ లండన్‌ కోర్టుకు హాజరై భారతదేశంలో న్యాయమైన విచారణ జరిగే అవకాశం లేదని చెప్పారు. తన కేసును రాజకీయం చేయడం, భారతీయ జైళ్లలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో అతను ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. కాగా […]

Written By: Suresh, Updated On : October 26, 2020 6:34 pm
Follow us on

భారత్‌ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను లండన్‌ కోర్టు ఐదోసారి తిరస్కరించింది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించే విచారణలో తదుపరి షెడ్యూల్‌ వరకు రిమాండ్‌ను పొడిగించింది. గత నెలలో నీరవ్‌ లాయర్‌ లండన్‌ కోర్టుకు హాజరై భారతదేశంలో న్యాయమైన విచారణ జరిగే అవకాశం లేదని చెప్పారు. తన కేసును రాజకీయం చేయడం, భారతీయ జైళ్లలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో అతను ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. కాగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో లండన్‌ పారిపోయిన నీరవ్‌ను మనీలాండరింగ్‌ అభియోగాలపై అప్పగించాలని భారత్‌ పోరాడుతోంది.