
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యలో మంగళవారం నుంచి జరిగే పీజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సోమవారం యూనివర్సిటీ ప్రకటించింది. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు పరీక్షలను వాయిదా వేశారు. అయితే పీజీ పరీక్షలు వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను నమ్మొద్దని పీజీ పరీక్షలు ఇదివరకు ప్రకటించిన ప్రకారంగానే ఉంటాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ అధికారులు పేర్కొన్నారు.