
బీహార్ రాష్ట్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం రానుందని ప్రధానమంత్రి మోడి అన్నారు. అరరియా జిల్లాలోని ఫోర్బ్స్‌గంజ్‌లో మంగళవారం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. గత ఎన్నికలతో పోలిస్తే బీహార్‌లో ఉదయం 10 గంటలకే అత్యధిక పోలింగ్ జరిగిందన్నారు. కరోనా వైరస్‌ను లెక్క చేయకుండా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలిరావడం అభినందనీయమన్నారు. ఇదే తరుణంలో ఏర్పాట్లు బాగా చేసిన పోలంగ్ సిబ్బందికి కృతజ్ఞతలు అని చెప్పారు. భారతీయుల మెదల్లలో ప్రజాస్వామ్యం ఎలా నాటుకుపోయిందో ప్రపంచవ్యాప్తంగా మేధావులు విశ్లేషించుకునే సందర్భంగా ఇదేనని ప్రధాని ఉద్ఘాటించారు.