సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా అనుష్క శెట్టి(స్వీటీ) కొనసాగుతోంది. కెరీర్ తొలినాళ్లలో అనుష్క గ్లామర్ పాత్రలకే పరిమితమై కుర్రకారును ఫిదా చేసింది. వరుసగా అగ్రహీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత ‘అరుంధతి’ లాంటి లేడి ఓరియేంటెడ్ సినిమాలు చేసి ఒంటిచేత్తోనే ఇండస్ట్రీ హిట్ సాధించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
అరుంధతి తర్వాత అనుష్క ఇమేజ్ మొత్తం మారిపోయింది. అనుష్క ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే లేడి ఓరియేంటేడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ‘వేదం’.. ‘రుద్రమదేవీ’.. ‘పంచాక్షరి’.. ‘భాగమతి’.. ‘నిశబ్ధం’ లాంటి సినిమాల్లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా అనుష్క సినిమాలు కలెక్షన్లు రాబతుండటం విశేషం.
తాజాగా టాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగిన కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగింది. దీంతో టాలీవుడ్లో పెళ్లీడు దాటిపోయిన భామలపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రధానంగా అనుష్క పెళ్లిపైనే అభిమానుల్లో జోరుగా చర్చ సాగుతోంది. లాక్డౌన్ సమయంలోనే అనుష్క పెళ్లిపై అనేక పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై అనుష్క సైతం పరోక్షంగా వివరణ ఇచ్చింది.
Also Read: పవన్ వెన్నంటే ఉంటూ దెబ్బేస్తున్న అభిమానులు..!
తాజాగా అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ‘పెళ్లిని నమ్ముతాను.. పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను.. అయితే పెళ్లి విషయంలో నాకు ఎలాంటి తొందర లేదు.. టైమ్ తీసుకొని నాకు నచ్చినవాడు ఎదురైనపుడే వివాహం చేసుకుంటాను’ అంటూ స్పష్టం చేసింది.
ఇక తన తల్లిదండ్రులు తనకు 20ఏళ్లు వచ్చినప్పటీ నుంచే వివాహం కోసం ఒత్తిడి తెచ్చేవారని చెప్పింది. అయితే ప్రస్తుతం అలాంటి ఒత్తిడి చేయడం మానేశారని చెప్పింది. ఇక తనకు కూడా ఇంకా సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని స్పష్టం చేసింది. దీంతో ఇప్పట్లో ఆమె పెళ్లి ఉండబోదని క్లారిటీ ఇచ్చింది.
Also Read: ఈసారి చిరు ఢీ కొట్టబోయేది హిందీ వాళ్లనే