కరోనా మహమ్మారి దేశంలోని ప్రజాప్రతినిధులను బలి తీసుకుంటుంది. తాజగా నాగాలాండ్ రాష్ట్ర మంత్రి సీఎం ఛాంగ్ కరోనాతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గతలంలో కరోనా బారిన పడ్డ మంత్రి చికిత్స కోసం కోహిమాలోని నాగా ఆసుపత్రిలో చేరారు. కరోనాకు తోడుగా ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువవడంతో మృతి చెందినట్లు స్థానిక వైద్యులు తెలిపారు. మంత్రి మృతి పట్ల రాష్ట్రంలో రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. సమాజ శ్రేయస్సుకోసం పనిచేసే నేతను కోల్పోయామని రాష్ట్ర గవర్నర్ ఆన్‌ఎన్ రవి సింగ్ తెలిపారు. నాగాలాండ్ రాష్ట్రవ్యాప్తంగా 7,240 మందికి కరోనా సోకగా 18 మంది మరణించారు.