సీఎం జగన్ కు మరో షాక్.. లిమిట్స్ అన్నీ దాటేశారంటూ సుప్రీంలో పిటిషన్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. న్యాయవాది సునీల్‌ కుమార్ సింగ్ సీఎంకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగాన్ న్యాయస్థానాలకు, న్యాయమూర్తులకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ఆయన ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎం జగన్ తన లిమిట్స్ అన్నీ దాటేశారని, ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఫిర్యాదు చేశారు. జగన్ సర్కార్ సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు. […]

Written By: Navya, Updated On : October 13, 2020 8:39 am
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. న్యాయవాది సునీల్‌ కుమార్ సింగ్ సీఎంకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగాన్ న్యాయస్థానాలకు, న్యాయమూర్తులకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ఆయన ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎం జగన్ తన లిమిట్స్ అన్నీ దాటేశారని, ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఫిర్యాదు చేశారు. జగన్ సర్కార్ సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు.

రాజ్యాంగంలోని 121, 211 ఆర్టికల్స్ ను జగన్ ఉల్లంఘించారని వెల్లడించారు. జగన్ ప్రమాణ స్వీకారం సమయంలో న్యాయవ్యవస్థను గౌరవిస్తానని, రాజ్యాంగం పట్ల వినయవిధేయతలను చూపుతానని ప్రమాణం చేశారని ప్రస్తుతం ఆ ప్రమాణాలను తుంగలో తొక్కారని పేర్కొన్నారు. జగన్ వైఖరి ప్రజల్లో న్యాయవ్యవస్థలపై నమ్మకం పోగొట్టే విధంగా ఉందని.. జగన్ న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రస్తావించారు.

రాజ్యాంగంలో ఒక వ్యవస్థను మరో వ్యవస్థ తప్పనిసరిగా గౌరవించాలని పేర్కొన్నారని.. ఏపీ ప్రభుత్వ ప్రతినిధి జడ్జిలపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడని అన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు పంపిన లేఖ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏమిటని న్యాయవాది పిటిషన్ లో ప్రస్తావించారు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రెస్ కాన్ఫరెన్స్ లను నిర్వహించకుండా చూడాలని పేర్కొన్నారు.

సీఎం జగన్ నిజంగా న్యాయ వ్యవస్థ గాడి తప్పుతోందని భావిస్తే అందుకు ఓ ప్రొసీజర్ ఉందని.. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్లి ఉంటే సరిపొయేదని తెలిపారు. సుప్రీం కోర్టు జడ్జి కొన్ని రోజుల క్రితం ప్రజాప్రతినిధులపై కేసులను వేగంగా పరిష్కరించాలని చెప్పిన నేపథ్యంలో జగన్ చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.