ఏపీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. పండుగల నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు ఉన్న ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే గతంతో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే రైళ్లు నడుస్తున్నాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల జగన్ సర్కార్ సైతం పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుపుతోంది. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే టికెట్ ధర కంటే వేలకు వేల రూపాయలు ఎక్కువగా ఖర్చు చేయాల్సి […]

Written By: Navya, Updated On : October 13, 2020 8:53 am
Follow us on

మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. పండుగల నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు ఉన్న ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే గతంతో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే రైళ్లు నడుస్తున్నాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల జగన్ సర్కార్ సైతం పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుపుతోంది.

ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే టికెట్ ధర కంటే వేలకు వేల రూపాయలు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ రాష్ట్రంలోని ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రెండు వారాల పాటు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా స్పెషన్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుండగా 28వ తేదీ వరకు బస్సులను నడపాలని అధికారులు భావిస్తున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యాన్ని సైతం కల్పిస్తోంది. ప్రయాణికులకు 2,028 బస్సులు అంబాటులోకి రాబోతున్నాయని తెలుస్తోంది. అధికారులు డిమాండ్ కు అనుగుణంగా రిజర్వేషన్ బస్సులను పెంచాలని భావిస్తున్నారు. తెలంగాణకు బస్సులు నడిపే విషయమై ఇరు రాష్ట్రాల ఆర్టిసీఇ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

దసరా పండుగ లోపే చర్చలు సఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్చలు కొలిక్కి వస్తే హైదరాబాద్ కు బస్సులు నడపడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని జగన్ సర్కార్ భావిస్తోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల భారీ నష్టాలను చవిచూస్తోంది. దసరా సీజన్ లో ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా బస్సులు నడిపి నష్టాలను తగ్గించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.