సెక్యూరిటీ లేకుండా గురుద్వారకు వెళ్లిన మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని గురుద్వార రకబ్ గంజ్ కు ఆకస్మికంగా వెళ్లారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మోదీ రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ కు నివాళులర్పించారు. కాగా మోదీ పర్యటించినప్పడు అక్కడ పోలీసులు కూడా లేకపోవడం విశేషం. కాగా అంతకుముందు ప్రధాని ట్విట్టర్ లో ‘గురుతేగ్ బహదూర్ జీవితం ధైర్యం, కరుణను సూచిస్తుంది, అతని సాహిది దివస్ సందర్భంగా ప్రణామాలు చేపడుతున్నా. న్యాయమైన సమాజం కోసం గురుతేజ్ […]

Written By: Suresh, Updated On : December 20, 2020 10:34 am
Follow us on

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని గురుద్వార రకబ్ గంజ్ కు ఆకస్మికంగా వెళ్లారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మోదీ రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ కు నివాళులర్పించారు. కాగా మోదీ పర్యటించినప్పడు అక్కడ పోలీసులు కూడా లేకపోవడం విశేషం. కాగా అంతకుముందు ప్రధాని ట్విట్టర్ లో ‘గురుతేగ్ బహదూర్ జీవితం ధైర్యం, కరుణను సూచిస్తుంది, అతని సాహిది దివస్ సందర్భంగా ప్రణామాలు చేపడుతున్నా. న్యాయమైన సమాజం కోసం గురుతేజ్ క్రుషి చేశారు.’ అని ట్వీట్ చేశారు. 10 మంది సిక్కు గురువులలో తొమ్మిదవ వ్యక్తి గురు తేగ్ బహదూర్. ఈయన 1621లో జన్మించారు. 1675లో అమరుడయ్యారు.