ఇటీవల ఓటిటిలో విడుదలైన చిన్న చిత్రాలలో విమర్శలకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది గతం మూవీ. నూతన నటీనటులు నటించిన ఈ చిత్రం సరికొత్త పంథాలో తెరకెక్కింది. కాగా ఈ చిత్రం అరుదైన గౌరవం దక్కించుకుంది. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి తెలుగు సినిమా విభాగం లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలియజేశారు.
Also Read: కేజీఎఫ్ 2 అప్డేట్: అభిమానులకి డిసెంబర్ 21న గుడ్ న్యూస్
ఈ ఏడాదిగాను ఐఎఫ్ఎఐ 51వ వార్షికోత్సవం కోసం భారతీయ పనోరమ విభాగం వివిధ బాషల నుండి అనేక చిత్రాలను ప్రకటించారు. అందులో తెలుగు సినిమా నుండి గతం సినిమాను ఎంపిక చేశారు. తమ చిత్రం ఓ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కి ఎంపిక కావడం పట్ల, చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ఫెస్టివల్ జనవరి 16 నుంచి 21 వరకు గోవాలో ఘనంగా జరగనుంది.
Also Read: ట్రైలర్ టాక్: ప్రేమ,పెళ్లి వద్దు సోలో బ్రతుకే ముద్దు అంటున్న సుప్రీమ్ హీరో
సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్ సంయుక్తంగా, ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. భార్గవ పోలుదాసు, రాకేశ్, గాలేభే, పూజిత ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకల మ్యూజిక్ అందించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గతం చిత్రీకరణ అమెరికాలో జరపడం విశేషం. కాగా గతేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలు తెరకెక్కిన ఎఫ్2 ఈ విభాగానికి ఎంపిక అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్