
ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ మహీందర్ వాట్సా అనారోగ్యంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ముంబై మిర్రర్ వార్తపత్రికలో మహీందర్ వాట్సా కాలమిస్టుగా ప్రసిద్ధి చెందారు. ఈ వార్త పత్రికలో ‘ఆస్క్ ది సెక్స్ ఫర్ట్’ పేరుతో తన కాలమ్ ప్రచురితమయ్యేది. లైంగిక ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా సమస్యలపై పరిష్కారంగా సమాధానాలిచ్చేవాడు. ముంబైకి చెందిన వాట్సాకు భార్య ప్రోమిలా, కుమారుడు ఉన్నారు.ఆయన 1950 సమయంలో ఇంగ్లాండులోని ఆసుపత్రిలో పనిచేశారు. ఆ తరువాత ఇండియాకు తిరిగొచ్చి మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. అదే సమయంలో గైనకాలజిస్ట్,ప్రసూతి వైద్యుడిగా ప్రాక్టీస్ పెట్టాడు. 1960లో కాలమిస్టుగా మారాడు. ఆ తరువాత లైంగిక సమస్యలపై తగు పరిష్కారాలను చెప్పేవాడు.