https://oktelugu.com/

సాయంత్ర సమయంలో తలుపులు మూసి ఉంచకూడదో తెలుసా?

మన ఇంట్లో ఉన్న పెద్దవారు ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే దీపాలను వెలిగించాలని, తలుపులు మూయకుండా, తెరిచే ఉంచాలని చెబుతుంటారు. అలా ఎందుకు చెబుతుంటారు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విధంగా మన పెద్దవారు చెప్పే ప్రతి ఒక్క విషయం వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి. అందుకోసమే వారి మాటలను కూడా మనం వినాల్సి ఉంటుంది. అయితే సాయంత్రం సమయంలో తలుపులు ఎందుకు మూసి ఉంచకూడదు అనేదాని వెనుక కూడా ఒక కారణం ఉంది. అది ఏమిటో ఇక్కడ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 28, 2020 / 09:57 AM IST
    Follow us on

    మన ఇంట్లో ఉన్న పెద్దవారు ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే దీపాలను వెలిగించాలని, తలుపులు మూయకుండా, తెరిచే ఉంచాలని చెబుతుంటారు. అలా ఎందుకు చెబుతుంటారు ఎప్పుడైనా ఆలోచించారా?
    ఆ విధంగా మన పెద్దవారు చెప్పే ప్రతి ఒక్క విషయం వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి. అందుకోసమే వారి మాటలను కూడా మనం వినాల్సి ఉంటుంది. అయితే సాయంత్రం సమయంలో తలుపులు ఎందుకు మూసి ఉంచకూడదు అనేదాని వెనుక కూడా ఒక కారణం ఉంది. అది ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

    Also Read: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. ఆ ఆఫర్లను నమ్మొద్దు..?

    సాయంత్ర సమయంలో మన ఇంట్లోకి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి వస్తుందని భావిస్తారు.అందువల్ల సాయంత్ర సమయంలో కూడా మనన్ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి తలుపులు తెరిచే ఉండటం వల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకోసమే సాయంత్రం వేళల్లో తలుపులు మూయకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. అంతేకాకుండా సాయంత్రం వేళల్లో జుట్టు విరబోసుకుని ఇంటికి సింహ ద్వారం ముందు కూర్చోకూడదని కూడా చెబుతుంటారు. అలా కూర్చోవడం వల్ల మన ఇంటికి వచ్చే లక్ష్మీదేవి అటు నుంచి బయటకు వెళ్ళిపోతుందని చెబుతుంటారు.

    Also Read: షియోమీ ఫోన్ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..?

    సాయంత్రం కేవలం మహాలక్ష్మీ మాత్రమే కాకుండా, జేష్ఠ లక్ష్మి కూడా మన ఇంట్లోకి వస్తుందని చెబుతారు. అయితే జేష్ఠ లక్ష్మి మన ఇంటి వెనుక ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి మన ఇంటి వెనుక వైపు ఉన్న తలుపులను సాయంత్రం వేళల్లో మూసివేయాలి. మన ఇంటి సింహ ద్వారం గుండా మహాలక్ష్మి వస్తుంది. కాబట్టి సింహద్వారాన్ని సాయంత్రం తెరిచే ఉంచాలని మన పెద్దలు చెబుతుంటారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం