తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు 205కు చేరాయి. గత ఆరు నెలల తరువాత ఇంత తక్కువగా నమోదు కావడం ఊరటనిస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 205 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,85,068గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,533గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,77,304 మంది కోలుకోగా ప్రస్తుతం 6,231యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 4,136 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో 24 గంటల్లో 27,244 పరీక్షలు నిర్వహించారు.