
భారత్‌లో త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సోమవారం అంతర్జాతీయ కరోనా వైరస్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. టీకా రెండో మోతాదు ఇచ్చే వరకు ప్రజలు నిర్లక్ష్యం వహిచకుండా.. రక్షణ నిబంధనలు పాటించాలని కోరారు. ‘కరోనా వైరస్ వ్యాక్సిన్ భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్న సమయంలో.. రెండో డోసు తీసుకునే వరకూ ఎవ్వరూ నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా’నన్నారు. ఇదిలా ఉండగా.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు సమాయత్తమవుతున్నాయి.