https://oktelugu.com/

కార్లు కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్.. రూ.మూడు లక్షల డిస్కౌంట్..?

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో కార్ల కంపెనీలు కార్లపై అదిరిపోయే డిస్కౌంట్ లను ప్రకటిస్తున్నాయి. మహీంద్ర కంపెనీ కొత్తకార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. కార్లు కొనాలనుకునే వారికి ఏకంగా మూడు లక్షల రూపాయల మేర ప్రయోజనాలకు కల్పించడానికి సిద్ధమైంది. క్లియరెన్స్ సేల్ లో భాగంగా కస్టమర్లకు మహేంద్ర కంపెనీ ఈ ప్రయోజనాలను కల్పిస్తోంది. Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు..? మహేంద్ర కంపెనీ థార్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 14, 2020 / 06:57 PM IST
    Follow us on


    మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో కార్ల కంపెనీలు కార్లపై అదిరిపోయే డిస్కౌంట్ లను ప్రకటిస్తున్నాయి. మహీంద్ర కంపెనీ కొత్తకార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. కార్లు కొనాలనుకునే వారికి ఏకంగా మూడు లక్షల రూపాయల మేర ప్రయోజనాలకు కల్పించడానికి సిద్ధమైంది. క్లియరెన్స్ సేల్ లో భాగంగా కస్టమర్లకు మహేంద్ర కంపెనీ ఈ ప్రయోజనాలను కల్పిస్తోంది.

    Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు..?

    మహేంద్ర కంపెనీ థార్ అనే మోడల్ మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ప్రయోజనాలను కల్పిస్తోంది. 2020 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ క్లియరెన్స్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ప్రముఖ కార్ల కంపెనీ సంస్థ హోండా ఆఫర్లను ప్రకటించగా మహీంద్ర కంపెనీ సైతం అదే బాటలో పయనించింది. కస్టమర్లు కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్ ఛేంజ్ బోనస్, నగదు రాయితీల రూపంలో ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

    Also Read: 2050లో యుగాంతం.. భూమిపై మహాప్రళయం సంభవించబోతుందా..?

    మహీంద్ర బొలెరాపై కంపెనీ 20,550 రూపాయలకు ప్రయోజనాలను కల్పిస్తోంది. స్కార్పియో కొనుగోలుపై 30,000 రూపాయలు, కేయూవీ 10 ఎస్.ఎక్స్.టీ కొనుగోలుపై 62,055 రూపాయలు, మహీంద్రా ఎక్స్.యూ.వీ కొనుగోలుపై 51,000 రూపాయలు, డిస్కౌంట్ పొందవచ్చు. అయితే కంపెనీ కారు ఖరీదును బట్టే డిస్కౌంట్ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తూ ఉండటం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    మిగతా కార్లతో పోలిస్తే మహీంద్ర కంపెనీ ఫ్లాగ్ షిప్ ఎస్.యూ.వీ బిఎస్ 6 అల్దూరస్ జీ4 పై ఏకంగా 3 లక్షల రూపాయల మేర ప్రయోజనాలను కల్పిస్తోంది. ఈ డిస్కౌంట్ లో ఏకంగా 2.20 లక్షల రూపాయలు నగదు డిస్కౌంట్ కావడం గమనార్హం. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇయర్ ఎండ్ డిస్కౌంట్ల ద్వారా తక్కువ ధరకే కారును కొనుగోలు చేయవచ్చు.