
దేశంలో ఇంధన ప్రణాళికకు సమగ్ర విధానాన్ని అవలంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం కేరళలోని కొచ్చి, కర్ణాటక మధ్య 450 కిలోమీటర్ల సహజవాయువు పైప్ లైన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో రహదారులు, రైల్వే, మెట్రో, వాయు పరిశ్రమలు అభివ్రుద్ధి చెందుతున్నాయన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో సహజవాయువును 32,000 కిలోమీటర్లకు విస్తరిస్తామన్నారు. కాగా గాలి, సౌరశక్తిని కలిపే హైబ్రిడ్ పునరుత్పాదక ప్లాంట్ గుజరాత్ లో ప్రారంభించామన్నారు. పదేళ్ల కాలంలో చెరుకు, ఇతర వ్యవపాయ ఉత్పత్తుల నుంచి సేకరించిన ఇథనాల్ లో 20 శాతం పెట్రోల్ ను తయారు చేయనున్నట్లు తెలిపారు.