వారందరికీ సీబీఐ నోటీసులు..: ఎందుకంటే..?

ఏపీలో న్యాయవ్యవస్థ వర్సెస్‌ సర్కార్‌‌ అన్నట్లుగా యుద్ధం నడుస్తోంది. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు.. హైకోర్టుపై విమర్శలు చేస్తూనే న్యాయమూర్తులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలకు ముడిపెట్టి మరీ సోషల్ మీడియాలో న్యాయమూర్తులను చంపుతామని హెచ్చరికలు చేసిన వ్యవహారంపై మెల్లగా సీబీఐ విచారణలో వేగం పెంచుతోంది. విదేశాల్లో కూడా నిందితులు ఉన్నందున వారిని విచారించడానికి నాలుగు నెలల సమయం కావాలని సీబీఐ కోర్టును కోరింది. ఆ మేరకు కోర్టు సమయం […]

Written By: Srinivas, Updated On : January 5, 2021 1:41 pm
Follow us on


ఏపీలో న్యాయవ్యవస్థ వర్సెస్‌ సర్కార్‌‌ అన్నట్లుగా యుద్ధం నడుస్తోంది. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు.. హైకోర్టుపై విమర్శలు చేస్తూనే న్యాయమూర్తులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలకు ముడిపెట్టి మరీ సోషల్ మీడియాలో న్యాయమూర్తులను చంపుతామని హెచ్చరికలు చేసిన వ్యవహారంపై మెల్లగా సీబీఐ విచారణలో వేగం పెంచుతోంది. విదేశాల్లో కూడా నిందితులు ఉన్నందున వారిని విచారించడానికి నాలుగు నెలల సమయం కావాలని సీబీఐ కోర్టును కోరింది. ఆ మేరకు కోర్టు సమయం ఇచ్చింది. దీంతో ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి వెళ్లిందని అనుకున్నారు. కానీ సీబీఐ.. ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. జడ్జిల కాల్ లిస్ట్ చెక్ చేయాలని.. వారు చంద్రబాబు చెప్పినట్లుగా తీర్పులు చెబుతున్నారని ఆరోపించిన ఎంపీ నందిగం సురేష్ ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లతోపాటు పలువురు వైసీపీ నేతలకు సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read: బీజేపీలో చేరేందుకు సినీ గ్లామర్ల క్యూ

హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు గతంలో సీఐడీ పోలీసులు కొంత మందిపైనే కేసులు నమోదు చేశారు. కానీ.. హైకోర్టు 90 మందికిపైగా నోటీసులు జారీ చేసింది. వారు చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డు చేశారు. సాక్ష్యాలతో సహా ఉన్నాయి. అయితే.. సీఐడీ మాత్రం తూ..తూ మంత్రంగా 15 మందిపై కేసులు పెట్టింది. ఆ కేసులపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసుల తీరుపై హైకోర్టు పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవడం లేదనే దానికి అదే సాక్ష్యమన్నట్లుగా పలుమార్లు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయినా పోలీసుల తీరులో మార్పు రాలేదు. చివరికి కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పుడు సీబీఐ న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసిన వారందరిపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆమంచి కృష్ణమోహన్, గుడివాడ అమర్నాథ్, నందిగం సురేష్ మాత్రమే కాదు.. పలువురు వైసీపీ నేతలు.. చాలా అసువుగా న్యాయమూర్తులపై బురద చల్లారు. చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వారి ఆరోపణలకు ఆధారాలు సమర్పించాల్సి ఉంది. టీవీల ముందు.. రికార్డెడ్‌గా వారు ఆ విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికీ నోటీసులు వెళ్తున్నాయి. న్యాయవ్యవస్థపై.. రాజకీయ పార్టీలపై చేసిట్లుగా ఆరోపణలు చేస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేశారని నమ్ముతారు. అందుకే.. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేసిన నేతలందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. వారు ఆధారాలు సమర్పించకపోతే కేసులు పెట్టే అవకాశం ఉంది.

Also Read: రామతీర్థం రణరంగం: సోము వీర్రాజు అరెస్ట్.. ఉద్రిక్తత

అయితే.. న్యాయవ్యవస్థపై దాడిని తేలిగ్గా తీసుకుంటే.. మున్ముందు అలాంటి దాడులు మరిన్ని పెరిగే ప్రమాదాలు లేకపోలేదు. అందుకే సీబీఐ తేలిగ్గా తీసుకోవడం లేదని చెబుతున్నారు. కాస్త సమయం తీసుకున్నా.. అందులో ఉన్న కుట్ర మొత్తాన్ని బయటకు లాగుతుందని న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నారు. అంతా ఆర్గనైజ్డ్‌గా జరిగిందని భావిస్తున్న సమయంలో.. సీబీఐ ఎంత సీరియస్‌గా పని చేస్తే.. అంత సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్