https://oktelugu.com/

ఖుష్భూకు తప్పిన ప్రమాదం

సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూకు కారు ప్రమాదం త్రుటిలో తప్పింది. బుధవారం ఉదయం ఆమె తమిళనాడులోని కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్ వద్ద ఖుష్భూ వెళ్తున్న కారు ట్యంకర్ ను ఢీకొట్టింది. అయితే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఖుష్భూ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిక ఖష్బూ పలు కార్యక్రమాల్లో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 18, 2020 / 11:30 AM IST
    Follow us on

    సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూకు కారు ప్రమాదం త్రుటిలో తప్పింది. బుధవారం ఉదయం ఆమె తమిళనాడులోని కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్ వద్ద ఖుష్భూ వెళ్తున్న కారు ట్యంకర్ ను ఢీకొట్టింది. అయితే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఖుష్భూ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిక ఖష్బూ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత వారంలో మహిళలపై ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై స్వయంగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే ట్విట్టర్ లో బీజేపీ నాయకులు ఆమెను పరామర్శిస్తున్నారు.