దేశంలో నిన్నటి వరకు కరోనా కేసులు తగ్గుదలకు రావడంతో ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే ఈరోజు కేసులు భారీగా పెరిగాయి. చలి తీవ్రతతో పాటు వాతావరణం కాలుష్యం పెరిగిపోవడంతో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ముఖ్యంగా అన్ లాక్ మార్గదర్శకాల ప్రకారం తెరుచుకున్న పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది . తాజాగా హర్యానా రాష్ట్రంలోని రేవారి పాఠశాలల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదు ప్రభుత్వ, మూడు ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 80 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో 15 రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవడంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.