కేసీఆర్ ను ఓవర్ టేక్ చేయలేకపోతున్న కేటీఆర్

తండ్రి కేసీఆర్ ఒక మర్రిచెట్టు అయితే.. ఆయన చెట్టునీడలో ఎదుగుతున్న వృక్షం కేటీఆర్. అయితే తండ్రిలోని దూకుడు.. సంచలన నిర్ణయాలు, గోపత్య, రాజకీయ చాణక్యత ఇప్పుడిప్పుడే కేటీఆర్ నేర్చుకుంటున్నారు. కానీ కేసీఆర్ లా బలంగా నిలబడలేకపోతున్నారు. దుబ్బాకలో ఓడిపోయాక కూడా జీహెచ్ఎంసీకి సై అన్న కేసీఆర్ తీరు సొంత పార్టీ నేతలనే కాదు.. కామ్ గా తన పని తాను చేసుకునే కేటీఆర్ ను సైతం ఆశ్చర్యపరిచిందన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. Also Read: వాళ్లకే […]

Written By: NARESH, Updated On : November 18, 2020 2:52 pm
Follow us on

తండ్రి కేసీఆర్ ఒక మర్రిచెట్టు అయితే.. ఆయన చెట్టునీడలో ఎదుగుతున్న వృక్షం కేటీఆర్. అయితే తండ్రిలోని దూకుడు.. సంచలన నిర్ణయాలు, గోపత్య, రాజకీయ చాణక్యత ఇప్పుడిప్పుడే కేటీఆర్ నేర్చుకుంటున్నారు. కానీ కేసీఆర్ లా బలంగా నిలబడలేకపోతున్నారు. దుబ్బాకలో ఓడిపోయాక కూడా జీహెచ్ఎంసీకి సై అన్న కేసీఆర్ తీరు సొంత పార్టీ నేతలనే కాదు.. కామ్ గా తన పని తాను చేసుకునే కేటీఆర్ ను సైతం ఆశ్చర్యపరిచిందన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

Also Read: వాళ్లకే టికెట్లా? టీఆర్ఎస్ పుట్టి మునుగుతుందా?

గ్రేటర్ హైదరాబాద్‌పై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే ప్లాన్ చేస్తోంది. తెంపరితనానికి.. మొండితనానికి.. సాహసానికి కేరాఫ్ అడ్రస్ గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనిపిస్తే.. అవేమీ కొడుకు కమ్ మంత్రి కేటీఆర్ లో కనిపించవని చెబుతారు. ఇప్పటికే విషయం ఏదైనా ఫైనల్ నిర్ణయం కేసీఆర్ దే అయినా.. కొన్ని సందర్భాల్లో తండ్రికి నచ్చ జెప్పేందుకు విపరీతంగా శ్రమిస్తుంటారన్న పేరు కేటీఆర్ కు ఉంది. అందుకే గ్రేటర్‌లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల పనులు పూర్తయి అందుబాటులోకి రాగా, మిగతా చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

Also Read: టీఆర్ఎస్ లో మేయర్ పీఠం ఆశావహులు వీరే..

ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయాన్ని కేటీఆర్ కు పూర్తిగా అప్పజెప్పారు కేసీఆర్. అయితే.. దుబ్బాక ఫలితం తర్వాత గ్రేటర్ మీద కేసీఆర్ ప్రత్యేకంగా కన్నేశారట. ఎవరెన్ని చెప్పినా.. గ్రేటర్ లో టీఆర్ఎస్ విజయం ఖాయం. ఆ మాటకు మరో మాట అవకాశమే లేదు. దారుణ పరిస్థితి అసలు ఉండదు.

ఒకవేళ ఉన్నప్పటికీ.. అంతిమంగా విజయం మాత్రం కారుదే. ఇలాంటి వేళ.. అభ్యర్థుల ఎంపిక.. ప్రకటన విషయంలో కేసీఆర్ లో సహజ సిద్ధంగా కనిపించే దూకుడు.. కేటీఆర్ లో అస్సలు లేదంటున్నారు కొందరూ. సేఫ్ గేమ్ అంటూ ఆయన వేస్తున్న ఎత్తులు పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

గ్రేటర్ ఎన్నికల వేళ.. కేసీఆర్ కు.. కేటీఆర్ కు మధ్యనున్న వ్యత్యాసం ఏమిటన్నది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని అంటున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కేసీఆర్ కున్న తెంపరితనం.. కేటీఆర్ లో మాత్రం కనిపించదన్న విషయం స్పష్టమైనట్లుగా కనిపిస్తుందట.