India Rich Village: ప్రపంచంలో ధనిక దేశాలు ఏవంటే అమెరికా నుంచి మొదలుపెడితే యూరప్ వరకు ఉంటాయి. ధనిక గ్రామాలు కూడా అదే ప్రాంతంలో ఉంటాయి. ప్రతి ఏడాది ప్రఖ్యాత సంస్థలు నిర్వహించే సర్వేలలో ఈ దేశాలలో ఉన్న ప్రాంతాలే ముందు వరుసలో ఉంటాయి. వాస్తవానికి ఆ సంస్థలు మనదేశంలో ఓ గ్రామాన్ని విస్మరించినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనదేశంలో రిచెస్ట్ విలేజ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అది ప్రపంచంలోనే అత్యంత ధనికమైన గ్రామంగా పేరు పొందింది.
Also Read: గో బ్యాక్ మార్వాడి.. తెలంగాణలో ఎందుకీ ఉద్యమం?
మన దేశంలోనే గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో మాధపర్ అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో 7,600 గృహాలు ఉంటాయి. ఇక్కడ ఏకంగా ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని 17 బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. కచ్ ప్రాంతానికి చెందిన మిస్త్రి అనే వ్యక్తి ఇక్కడ స్థిరపడ్డాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ గ్రామంలో జనాభా పెరిగారు. గుజరాత్ రాష్ట్రంలోని 18 గ్రామాలనుంచి వచ్చిన కొంతమంది ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. బ్యాంకులలో నగదు నిల్వల పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ విలేజ్ గా పేరుపొందింది. మాధపర్ గ్రామంలో 17 బ్యాంకులు సేవలందిస్తున్నాయి. ఇందులో మొత్తం ఐదు వేల కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయి. ప్రతి ఇంటిలో దాదాపు సగటున 15 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నాయి.. అయితే ఈ స్థాయిలో ఈ గ్రామంలో డిపాజిట్లు ఏర్పడేందుకు ప్రధాన కారణం.. ఈ ప్రాంతానికి చెందిన వారి పిల్లల్లో చాలామంది యూకే, అమెరికా, కెనడాలో స్థిరపడమే. ఈ గ్రామంలో ఉన్న జనాభాలో ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. వారు అక్కడి నుంచి చేసే చెల్లింపుల ద్వారా ఇక్కడ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి.. గడచిన ఏడాది.. ఈ ఏడాది రెట్టించిన స్థాయిలో డిపాజిట్లు వచ్చాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
Also Read: పంద్రాగస్టు వేడుకల్లో షాక్ ఇచ్చిన రేవంత్.. చంద్రబాబు ఏం చేస్తారో?
ఈ మాధపర్ పేరుకు గ్రామం అయినప్పటికీ.. ఇది చూసేందుకు ఒక సిటీని తలపిస్తుంది. చుట్టుకొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకుంటుంది. రోడ్లు కూడా విశాలంగా ఉంటాయి. అత్యంత ఆధునికమైన గృహాలు ఆకట్టుకుంటాయి. పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ప్రఖ్యాతస్థాయి విద్యాసంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలుపుకొని మొత్తం 17 బ్యాంకులు ఇక్కడ సేవలు అందిస్తున్నాయి అంటే డిపాజిట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది వ్యాపారాలు సాగిస్తుంటారు. వ్యవసాయంలోనూ కొత్త కొత్త విధానాలు అవలంబిస్తూ భారీగానే సంపాదిస్తుంటారు. అందువల్లే ఈ గ్రామం ప్రపంచంలోనే బ్యాంకు డిపాజిట్ల పరంగా రిచెస్ట్ విలేజ్ గా పేరుపొందింది. గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాటిని కూడా ఇదేవిధంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు గుజరాత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.