Homeఅంతర్జాతీయంNuclear Capable Missile: భారత్‌ నోటామ్‌.. మన శత్రుదేశాల్లో కలవరం.. ఏ జరగబోతోంది?

Nuclear Capable Missile: భారత్‌ నోటామ్‌.. మన శత్రుదేశాల్లో కలవరం.. ఏ జరగబోతోంది?

Nuclear Capable Missile: నోటామ్‌.. ఈ పదం చాలా మందికి తెలియదు.. నోటామ్‌ అంటే నోటీస్‌ టూ ఎయిర్‌ మెన్‌.. విమానాలు, హెలిక్యాప్టర్లు నడిపేవారికి జారీ చేసే ప్రకటన. సాధారణంగా ఈ నోటామ్‌ను యుద్ద సమయాల్లో దేశాలు జారీ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గగనతల నిషేధం. ఎలాంటి యుద్ధాలు లేని సమయంలో ఈ నోటామ్‌ను భారత్‌ జారీ చేసింది. ఆగస్టు 20, 21 తేదీల్లో అమలులో ఉండనుంది. ఇది బంగాళాఖాతంలో 4,795 కిలోమీటర్ల దూరం వరకు వర్తిస్తుంది. ఇదే ఇప్పుడు మన శత్రు దేశాలను కలవర పెడుతోంది. భారత్‌ ఏం చేయబోతోంది అన్న ఉత్కంఠ ఇటు పాకిస్తాన్, టై చైనా, బంగ్లాదేశ్‌తపాటు అగ్రరాజ్యం అమెరికాలోనూ నెలకొంది. నోటామ్‌ భారత్‌ దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షకు సంబంధించినదని, ఇది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన క్షిపణి అయి ఉండవచ్చని సమాచారం. ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ద్వీపంలో జరగనున్న ఈ పరీక్ష భారత్‌ యొక్క సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటనుందని తెలుస్తోంది.

Also Read: రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు భర్త సహకరించలేదని విడాకులు ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఆమెనే!

చరిత్ర, సామర్థ్యం..
భారత్‌ క్షిపణి కార్యక్రమం 1989లో అగ్ని–1 ప్రయోగంతో ప్రారంభమైంది. 2012లో అగ్ని–5 పరీక్ష విజయవంతంగా పూర్తయింది, ఇది 5 వేల కిలోమీటర్ల శ్రేణిలో అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత నోటామ్‌ సూచనల ప్రకారం, ఈసారి అగ్ని–6 లేదా ఇతర అధునాతన క్షిపణి పరీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. అగ్ని–6 దీర్ఘ శ్రేణి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిగా ఉండవచ్చని, ఇది చైనా మధ్య భాగం వరకు దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుందని అంచనా. ఈ క్షిపణులు ఆపరేషన్‌ సిందూర్‌లో ఉపయోగించిన అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయి. ఇది భారత్‌ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

అబ్దుల్‌ కలాం ద్వీపంలో పరీక్షలు..
ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ద్వీపం (పూర్వపు వీలర్‌ ఐలాండ్‌) భారత్‌ క్షిపణి పరీక్షలకు ప్రధాన కేంద్రంగా ఉంది. గతంలో ఈ పరీక్షలు పాకిస్తాన్‌ సరిహద్దులోని ఫోక్రాన్‌లో జరిగేవి, కానీ భద్రతా కారణాల వల్ల 1980 చివరలో వీలర్‌ ఐలాండ్‌ను ఎంచుకున్నారు. డాక్టర్‌ సాల్వాన్, డాక్టర్‌ సారస్వత్‌ ఈ ద్వీపాన్ని సందర్శించి, దాని వ్యూహాత్మక స్థానాన్ని గుర్తించారు. 99 ఏళ్ల లీజ్‌పై డీఆర్‌డీఓకు ఇవ్వబడిన ఈ ద్వీపం, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మరణానంతరం ఆయన పేరుతో పిలవబడుతోంది.

అంతర్జాతీయ ఆందోళనలు…
4,795 కిలోమీటర్ల శ్రేణి నోటామ్‌ ప్రకటనతో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు అమెరికా కూడా ఈ పరీక్షపై ఆసక్తి చూపుతోంది. ఈ శ్రేణి సాధారణ రీజనల్‌ క్షిపణులకు మించి, అంతర్ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ పరీక్ష విజయవంతమైతే, భారత్‌ రక్షణ సామర్థ్యం చైనా మధ్య భాగం వరకు విస్తరిస్తుంది, ఇది ఆసియా రాజకీయ సమతుల్యతను మార్చవచ్చు. అదనంగా, ఈ క్షిపణులను ఎగుమతి చేసే అవకాశం భారత్‌కు ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు.

Also Read:  10 అంతస్థుల లోపల మెట్రో స్టేషన్.. రష్యాలో ఈ అద్భుతం

మొత్తంగా ఆగస్టు 20, 21 తేదీల్లో జరగనున్న క్షిపణి పరీక్ష భారత రక్షణ సామర్థ్యంలో కీలక మైలురాయి. అగ్ని–6 లేదా ఇతర అధునాతన క్షిపణి అయినా, ఈ పరీక్ష భారత్‌ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్‌ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటనుంది. అబ్దుల్‌ కలాం ద్వీపంలో జరిగే ఈ పరీక్షలు భారత్‌ యొక్క సైనిక ఆధునికీకరణ, వ్యూహాత్మక ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. అంతర్జాతీయ ఆందోళనల మధ్య, ఈ పరీక్ష భారత్‌ రక్షణ స్వావలంబన, ఆసియా రాజకీయ రంగంలో దాని ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెబుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular