India Vs Turkey: ప్రస్తుతం దేశంలోని లౌమహ్మద్, ఆసియా కప్ క్రికెట్ టోర్నీ, యూనివర్సిటీ ఎన్నికలపై చర్చ ఝరుగుతోంది. ఇలాంటి తరుణంలో భారత్ కీలక అడుగు వేసింది. ముఖ్యంగా మధ్యధరా సముద్ర ప్రాంతంలో సైప్రస్ దేశంతో బలమైన సహకారాన్ని పెంచుకుంటూ, టర్కీ వంటి దేశాల ఆధిపత్యాన్ని సమతుల్యం చేసే ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత నావికాదళానికి చెందిన యుద్ధ నౌక ఒకటి సైప్రస్ తీరంలో ఆధునిక సాంకేతికతలతో లంగర్ వేసింది. ఇది కేవలం సైనిక చర్య కాకుండా, వ్యూహాత్మక దృక్పథంతో జరిగిన పరిణామంగా చూడవచ్చు.
వ్యూహాత్మక అడుగు..
సైప్రస్‌లో భారత యుద్ధ నౌక లంగరు వేయడానికి రానపం సైప్రస్ ద్వీప దేశం మధ్యధరా సముద్రంలో ఎంతో వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగినది. టర్కీ దీని సగభాగాన్ని ఆక్రమించుకుని ఉండటంతో, గ్రీస్, ఆర్మేనియా వంటి దేశాలు సైప్రస్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ సమయంలో భారత్ తన అత్యాధునిక యుద్ధ నౌకను సైప్రస్‌లోని లిమసోల్ తీరంలో ఉంచడం ద్వారా, ప్రాంతీయ సమతుల్యతను బలోపేతం చేస్తోంది. ఈ నౌక అడ్వాన్స్‌డ్ సెన్సార్లు, స్టెల్త్ సిస్టమ్స్‌తో సమర్థవంతమైన ఆయుధాలను కలిగి ఉండటం వల్ల, ఏదైనా దాడి సమయంలో గుర్తించకుండా చర్యలు తీసుకోవడానికి సాధ్యపడుతుంది.ఈ డెప్లాయ్‌మెంట్ ముందు భారత్ ఐదు నుంచి ఏడు దేశాలతో సంయుక్త సైనిక విన్యాసాలు జరిపింది. ఇది ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో బహుముఖ సహకారాన్ని సూచిస్తుంది. టర్కీ ఇటీవల పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూ, డ్రోన్లు సరఫరా చేయడం, కరాచీ పోర్టుకు తన యుద్ధ నౌకలు పంపడం వంటి చర్యలు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సైప్రస్‌లో భారత నౌక ఉంచడం టర్కీకి పరోక్షంగా హెచ్చరికగా పనిచేస్తుంది. టర్కీ–సైప్రస్ వివాదంలో భారత్ పాత్రసైప్రస్ యూరోపియన్ యూనియన్‌లో సభ్య దేశం మరియు సంపన్న ఆర్థిక వ్యవస్థ కలిగినది. గత 23 ఏళ్లలో మొదటిసారిగా భారత ప్రధాని ఈ ఏడాది జూన్‌లో సైప్రస్ సందర్శించడం గమనార్హం. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది.
టర్కీ–పాకిస్తాన్ బంధం..
టర్కీ ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌తో సన్నిహితంగా ఉంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో మద్దతు ఇవ్వడం వల్ల భారత్ టర్కీని ఇరుకున పెట్టే వ్యూహాలు రూపొందించింది. గ్రీస్, ఆర్మేనియా వంటి దేశాలతో సైప్రస్‌ను కూడగట్టి, టర్కీ ఆధిపత్యాన్ని చెక్ చేయడం భారత్ లక్ష్యం. ఈ వ్యూహంలో సైప్రస్‌లో భారత యుద్ధ నౌక ఉంచడం కీలకం. ఇది మధ్యధరా సముద్రంలో భారత ప్రయోజనాలను కాపాడటమే కాకుండా, భవిష్యత్తులో ఏర్పాటు కానున్న ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఇఎంఈసీ)లోనూ సహాయపడుతుంది. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మీదుగా నిర్మించనున్న ఈ కారిడార్‌లో సైప్రస్ ఒక ముఖ్యమైన లింక్‌గా మారవచ్చు.ఆర్థిక మరియు రక్షణ సహకారం: భవిష్యత్ దృక్పథంసైప్రస్‌తో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో ఆసక్తి చూపుతోంది. ఇటీవల ముంబైలో సైప్రస్ బ్యాంకు ఏర్పాటు కావడం దీనికి నిదర్శనం. రాబోయే నాలుగేళ్లలో సైప్రస్ నుంచి మూడు రకాల సాయం భారత్ ఆశిస్తోంది: రక్షణ సహకారం, సముద్ర జలాల భద్రత, మరియు సైప్రస్ సైనికులకు శిక్షణ. ఇది రెండు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను పెంచుతుంది.
భవిష్యత్తులో టర్కీ సైప్రస్‌పై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, సైప్రస్‌లో ఉన్న భారత యుద్ధ నౌక సమర్థవంతంగా స్పందించవచ్చు. ఇది చిన్న చర్యలా కనిపించినా, పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీని నియంత్రించడంలో భారత్ వ్యూహాత్మక లాభాన్ని సాధిస్తుంది. మొత్తంగా, ఈ పరిణామాలు భారత్ అంతర్జాతీయ వేదికలపై మరింత బలమైన స్థానాన్ని సాధించే దిశగా సూచిస్తున్నాయి.