AP Government: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాజా నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాలకు గృహనిర్మాణంలో కొత్త ఊరటనిస్తోంది. సాధారణంగా గృహ నిర్మాణ అనుమతుల క్రమంలో ఎదురయ్యే ఖర్చులు, చిక్కులు ఇప్పుడు రూపాయికి మాత్రమే పరిమితం చేసింది. దీంతో గృహ కలను సాకారం చేసుకోవడం సులభం కానుంది.
ప్రభుత్వ నిర్ణయం..
– మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల పరిధిలో 50 గజాల వరకు ఉన్న స్థలాల్లో జీ+1 లేదా ఆంతకన్నా తక్కువ అంతస్తుల భవనాల నిర్మాణానికి కేవలం ఒక రూపాయి ఫీజుతో అనుమతి ఇ్వనున్నారు. ఇంటి అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి తన ఇంటి ప్లాన్, అవసరమైన వివరాలు డిజిటల్‌గా సమర్పించి రూపాయి చెల్లిస్తే వెంటనే పర్మిషన్ వస్తుంది.
ప్రజలకు లభించే ప్రయోజనాలు
– సంవత్సరానికి సుమారు రూ.6 కోట్ల భారం ప్రజలపై నుంచి తొలగిపోతుంది.
– పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇల్లు కట్టే సమయంలో ఎదురయ్యే ఆర్థిక భారానికి ఉపశమనం.
– నిర్మాణ అనుమతుల కోసం తిప్పలు పడే అవసరం తగ్గుతుంది.
– డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకత పెరగడంతో అవినీతి అవకాశాలు తగ్గే అవకాశం.
– స్వంత ఇంటి కల నెరవేర్చుకోవాలని భావించే పేదవర్గాల ఉత్సాహం పెరుగుతుంది.
– పట్టణాలు, పల్లెలలో గహనిర్మాణ వేగం పెరగవచ్చు.
– ఇది గృహరంగాన్ని మాత్రమే కాకుండా సిమెంట్, ఉక్కు, నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు పెంచే అవకాశం ఉంది.
మధ్య తరగతి ప్రజలకు ప్రత్యక్ష లాభం కలిగించే విధానం కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా సానుకూల వాతావరణాన్ని కలిగించవచ్చు. ఖర్చులు తగ్గడం వల్ల ప్రజల ఆదాయం కొంత మేర ఇతర అవసరాలపై వినియోగించబడుతుంది. రూపాయికే అనుమతులు అనే నిర్ణయం సామాన్య ప్రజలకు పెద్ద ఊరటనిస్తూనే, ప్రభుత్వ సంక్షేమ దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది గృహనిర్మాణాలను ప్రోత్సహిస్తూ, అవినీతిని తగ్గించేందుకు దోహదపడే అవకాశముంది.