ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

నివర్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో నెల్లూరు, కృష్ణ, కడప, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. ఇక తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి మబ్బులు ఉండడంతో వర్షం కురిసే అవకాశం ఉందని […]

Written By: Suresh, Updated On : November 26, 2020 8:32 am
Follow us on

నివర్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో నెల్లూరు, కృష్ణ, కడప, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. ఇక తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి మబ్బులు ఉండడంతో వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు తమిళనాడు, పుదుచ్చేరిలో ఇప్పటికే కుండపోత వర్షం కురిసింది. ఇక రెండు రాష్ట్రాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఆయా ప్రభుత్వాాలు సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బ్రుందాలను రంగంలోకి దించింది.