https://oktelugu.com/

కేసీఆర్ కు స్వామిగౌడ్ ఇలా షాకిస్తాడనుకోలేదు!

గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరి జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఢిల్లీలో కడిగివేశారు. కేసీఆర్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ అధిష్టానానికి వ్యతిరేకంగానే ఆయన కామెంట్ చేసినట్టు దుమారం రేపుతున్నాయి. Also Read: టీఆర్ఎస్, […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2020 / 09:02 PM IST
    Follow us on

    గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరి జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై ఢిల్లీలో కడిగివేశారు. కేసీఆర్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ అధిష్టానానికి వ్యతిరేకంగానే ఆయన కామెంట్ చేసినట్టు దుమారం రేపుతున్నాయి.

    Also Read: టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు ఎందుకీ చీత్కారాలు?

    కేసీఆర్ ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నాడని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని నెత్తిన పెట్టుకొని ఉద్యమకారులను తొక్కేస్తున్నాడని స్వామి గౌడ్ ఆరోపించారు. ఆత్మాభిమానం చంపుకోలేకే బీజేపీలో చేరానని వివరించారు.

    ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ అడిగినా కేసీఆర్ ఇవ్వలేదని.. రెండేళ్లుగా ఓపిక పెట్టి సహనం నశించి బీజేపీలో చేరానని స్వామి గౌడ్ అన్నారు. పదవుల కోసం బీజేపీలో చేరలేదని.. టీఆర్ఎస్ లో తన ఆత్మాభిమానం చంపుకోలేక ఇలా చేరానని స్వామి గౌడ్ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కొంతకాలంగా టీఆర్ఎస్ లో స్వామిగౌడ్ అసంతృప్తిగా ఉంటున్నాడు. కేసీఆర్ ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో అప్పట్లోనే అసమ్మతి గళం వినిపించాడు. తెలంగాణలో కొన్ని కులాలే పరిపాలన.. ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయని ఆరోపించారు. అధికారం కొంతమందికే పరిమితమైందన్నారు. కుల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతున్నాయని.. కొన్ని కులాల వారు మాత్రమే పరిపాలనలో ఉండి ప్రజలను పాలిస్తున్నారని.. బీసీలను ముందుకు తీసుకెళ్లాలని స్వామి గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులరక్కసితో బీసీలకు అన్యాయం జరుగుతోందని స్వామి గౌడ్ అన్నారు.

    Also Read: న్యాయవ్యవస్థపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

    తెలంగాణ శాసన మండలి చైర్మన్ పదవి నుంచి తొలిగినప్పటి నుంచి స్వామి గౌడ్ టీఆర్ఎస్ లో యాక్టివ్ గా లేరు.కేసీఆర్ ఆయనకు పదవిని రెన్యువల్ చేయలేదు. ఈ క్రమంలోనే స్వామి గౌడ్ తాజాగా బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని స్వామి గౌడ్ జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు..కేసీఆర్ కు షాకిచ్చారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్